అన్ని హంగులతో మెట్రో ప్రారంభానికి సిద్ధం

అన్ని హంగులతో మెట్రో ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రధాని చేతులమీదుగా ప్రారంభించేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్‌ మెట్రో అని తెలిపారు. దేశ చరిత్రలోనే 30 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే  దక్కుతుందన్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ఎంఎంటీఎస్‌ రెండో దశలో కదలిక వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. ఎంఎంటీఎస్‌ రెండో దశ కోసం 817 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.