అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డిలకు సీఎం కేసీఆర్ అభినందన

నూతన డీజీపీగా నియమితులైన ఎం.మహేందర్‌ రెడ్డి, హోంశాఖ సలహదారుడిగా నియమితులైన అనురాగ్‌శర్మ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర హోంశాఖ సలహాదారుగా నియమించినందుకు అనురాగ్ శర్మ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర మొదటి డీజీపీగా సేవలందించి, ఆదివారం పదవీ విరమణ చేస్తున్న అనురాగ్‌ శర్మకు ప్రభుత్వం తరపున ప్రగతి భవన్ లో మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.