అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కదులుతున్న రైళ్ళలోని ప్రయాణికులను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ఏడుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు రూ.60 లక్షల విలువైన 2 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 కేసులలో వీరు నిందితులుగా ఉన్నారని రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. హర్యానకు చెందిన ఈ ముఠా దొంగిలించిన సొమ్మును ఎవ్వరికి అనుమానం రాకుండా రైల్వే ట్రాక్ పక్కన మట్టిలో దాచిపెడతారని, అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళి  వారి ప్రాంతంలో అమ్ముకొని జల్సాలు చేస్తారని అశోక్ కుమార్ వివరించారు.