అంతర్జాతీయ స్థాయి డ్రైవింగ్ శిక్షణ సంస్థ ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లి దగ్గర అంతర్జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ పరిశోధన సంస్థ ఏర్పాటు చేసినట్టు మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల స్థలం కేటాయించిందని చెప్పారు. ప్రాజెక్టు వ్యయం 16 కోట్ల 48 లక్షలని వివరించారు. డ్రైవింగ్‌ శిక్షణ పరిశోధన సంస్థ ద్వారా ఏటా 18 వేల మందికి పైగా ట్రైనింగ్‌ ఇస్తున్నట్టు తెలిపారు.