త్వరలో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

రాష్ట్ర ప్రభుత్వం 8792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుందన్నారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ అతి త్వరలోనే వస్తుందన్నారు. వరంగల్‌లో నిర్మించే కాకతీయ టెక్స్‌ టైల్‌ పార్క్‌ కు  ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. 2వేల ఎకరాల్లో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్ నిర్మాణం చేయనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.