851 ఏఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 851 ఏఈవో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వచ్చే నెల 21న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.