25 ఏళ్ల తర్వాత నిండిన షాబాద్‌ పైల్వాన్‌ చెరువు

సీఎం కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ కాకతీయ సత్ఫలితాలు ఇస్తుందన్నారు ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి. మిషన్‌ కాకతీయ పనులతో షాబాద్‌ పైల్వాన్‌ చెరువు కొత్తరూపు సంతరించుకుందన్నారు. 25 ఏళ్ల తర్వాత పైల్వాన్‌ చెరువు అలుగు పారదడం ఇదే మొదటిసారి అని నరేందర్‌రెడ్డి తెలిపారు. తర్వాత చెరువులో చేపపిల్లలు వదిలారు పట్నం నరేందర్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.