హ్యాట్రిక్ రేస్‌ లో మెహరిన్

అందాల ముద్దుగుమ్మ మెహరిన్ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నది. మహానుభావుడు చిత్రం మొదలుకొని జవాన్ – కెరాఫ్ సూర్య – రాజా ది గ్రేట్ ఇలా క్రేజీ సినిమాలతో న‌టి మెహరిన్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన మహానుభావుడులో మెహరిన్ అభినయానికి విమర్శకులు మంచి మార్కులే వేసారు. ఇక దీపావళి కానుకగా విడుదల కాబోతున్న రాజా ది గ్రేట్ లో మాస్ రాజా రవితేజ సరసన నటిస్తోంది మెహరిన్. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే రాజా ది గ్రేట్ లో మెహరిన్ నటనతో పాటు గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచినట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అందుకుంటే మెహరిన్ కి హ్యాట్రిక్ వచ్చినట్లే అని సినీజనాలు అంటున్నారు. అంతేకాదు కాజల్ ,సమంత, తమన్నా, రకుల్ జోరు తగ్గడంతో వారిని మెహరిన్ రీప్లేస్ చేస్తుందనే టాక్ నడస్తోంది.