హైదరాబాద్ వర్ష ప్రభావిత కాలనీల్లో మేయర్ పర్యటన

హైదరాబాద్‌ ఉప్పల్‌ లో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పర్యటించారు. వర్షం కారణంగా నీరు నిలిచిన కాలనీలను పరిశీలించారు. తర్వాత రామంతాపూర్‌ పెద్దచెరువు సమస్యలపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.