హైదరాబాద్ లో భారీ వర్షం

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, అమీర్ పేట, ముషీరాబాద్, చంపాపేట, ఎర్రగడ్డ, దిల్ సుఖ్ నగర్ , ఈసీఐఎల్ పలు ప్రాంతంలో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.