హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్ లో సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు పలుచోట్ల జలమయమయ్యాయి. కొన్నిచోట్ల బస్తీల్లో నీళ్లు నిలిచాయి. అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మెల్లగా సాగుతోంది.