హైదరాబాద్ లో భక్తిశ్రద్ధలతో మొహరం

మొహరం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో మాతం నిర్వహించారు. వందలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. షియా ముస్లింలు ఊరేగింపులో తమను తాము బ్లేడ్‌లు, కత్తులతో గాయపర్చుకుని రక్తం చిందించారు. మొహర్రం అంటే త్యాగాల చరిత్ర అని మత పెద్దలు తెలిపారు.