హెచ్‌సీయూ వద్ద భారీగా వరద నీరు

రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం చివురుటాకులా వణికింది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో..  వాహనదారుల అవస్థలు పడుతున్నారు. టెలికాంనగర్ లోని రీజినల్ టెలికమ్ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయం ప్రహరీగోడ కూలడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.. వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు