సూర్యాపేట కలెక్టరేట్ కు సీఎం కేసీఆర్ భూమిపూజ

సూర్యాపేట జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. చివ్వెంల మండలం కుడకుడలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.