సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ ప్రసాద్

రైల్వే టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్… సీబీఐ ముందు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.  లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో….ఓ రైల్వే హోటల్ టెండర్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. దీనిపై గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో లాలూ తనయుడు తేజస్వీ కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు