సీఎం కేసీఆర్ మాటే  శిలాశాసనం

సీఎం కేసీఆర్  మాటే శిలాశాసనమని..సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందని ఎంపీ బాల్క సుమన్  తేల్చిచెప్పారు. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టడమే కాకుండా..సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గించిందే కాంగ్రెస్, టీడీపీ అనుబంద సంఘాలని సుమన్ మండిపడ్డరు. ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నరని..సింగరేణిలో సైతం టీబీజీకేఎస్  గెలుపు ఖాయమన్నరు. మరోవైపు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే దివాకర్  రావు మండిపడ్డరు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నరు. విపక్ష నేతలు కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరని…కార్మికులు టీబీజీకేఎస్ వైపే ఉన్నారని ఎమ్మెల్యే దివాకర్రావు స్పష్ట్రం చేశారు.