సీఎం కేసీఆర్ పర్యటనకు సిద్దిపేటలో ఏర్పాట్లు

ఈ నెల 11న (ఎల్లుండి) సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుద్దేడ సమీపంలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ నిర్మాణ స్థలాలను మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ  సలహాదారు వివేక్ పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను కూడ మంత్రి హరీశ్ పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులకు పర్యవేక్షిస్తున్నారు.