సిద్దిపేట్ జిల్లాను ముద్దాడిన గోదావరి నీళ్లు

ప్రభుత్వ సంకల్పం.. మంత్రి హరీష్‌రావు పట్టుదలతో గోదావరి నీళ్లు మొట్టమొదటిసారి సిద్ధిపేట జిల్లాను ముద్దాడాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా సిద్ధిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు మంత్రి హరీష్‌రావు నీటిని విడుదల చేసారు. ఈ కాల్వ ద్వారా జిల్లాలోని 31 చెరువులు నింపి సాగు నీరందిస్తామని స్పష్టం చేసారు. సింగూరు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోని 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చే భాగ్యం తనకు కలగడంపై ఆనందం వ్యక్తం చేసారు మంత్రి హరీష్‌. కోటి ఎకరాలకు నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అనుక్షణం కష్టపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు