సింగూర్ జలాశయానికి జలకళ

సింగూరు జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 29.9 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో.. ప్రస్తుతం 29.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 8,100 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండడంతో.. ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు.. రెండు టర్బైన్ల సహాయంతో 14 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.