సింగరేణి ఏరియాలో జోరుగా టీబీజీకేఎస్ ప్రచారం

కోల్‌ బెల్ట్ ఏరియాలో టీబీజీకేఎస్ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజాప్రతినిధులు ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా.. సింగరేణి కార్మికులు అక్కున చేర్చుకుంటున్నారు. టీబీజీకేఎస్ నే గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. జయశంకర్ భూపాల్ పల్లిలో టీబీజీకేఎస్ తరఫున ఎంపీలు వినోద్‌ కుమార్, పసునూరి దయాకర్‌, సివిల్‌ సప్లై కార్పోరేషన్ ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. వివిధ సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ లో చేరారు. నేతలు వారికి కండువాలు కప్పి, టీబీజీకేఎస్ లోకి ఆహ్వానించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల సమస్యలు సీఎం కేసీఆర్ తోనే పరిష్కారం అవుతాయన్నారు ఎంపీలు వినోద్‌ కుమార్‌, పసునూరి దయాకర్‌. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తారని సివిల్‌ సప్లై ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు…

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ప్రచారంతో దూసుకుపోతోంది.  గోదావరిఖనిలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌, ఆర్టీసీ ఛైర్మెన్ సోమారపు సత్యనారాయణ, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. టీడీపీ హయాంలో పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు తిరిగి ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్తుంటే.. జాతీయ సంఘాలు అనవసరపు రాద్దాంతం చేస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటించిన అన్ని అంశాలను తప్పకుండా నెరవేరుస్తారని.. కార్మికులు బాణం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారాయన…

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పరిధిలోని ఆర్జీ త్రీ, ఓసీపీ వన్‌, సీహెచ్పీ ప్రాంతంలో టీబీజీకేఎస్ ప్రచారం జోష్‌ ఫుల్‌ గా సాగుతోంది. గేట్‌ మీటింగ్‌ లలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు పుట్ట మధు, మనోహర్ రెడ్డి, టీబీజీకేఎస్ కార్యదర్శి కెంగర్ల మల్లయ్య పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల బాగోగుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని వివరించారు. సింగరేణిపై టీబీజీకేఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో టీబీజీకేఎస్ తరఫున మహిళలు విస్తృతంగా ప్రచారం చేశారు. సింగరేణి కార్మిక వాడల్లో .. ఇంటింటికి తిరుగుతూ, బొట్టు పెడుతూ క్యాంపెయిన్ చేశారు. టీబీజీకేఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో  స్ర్తీ శిశు సంక్షేమ శాఖా ఆర్గనైజర్ అత్తి సరోజతోపాటు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీబీజీకేఎస్‌ ప్రచారంలో దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్‌ నేతలు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇల్లందులో ఐ‌ఎన్‌టీ‌యూ‌సీకి చెందిన పలువురు నేతలు టబీజీకేఎస్‌లో చేరారు. ఎం‌ఎల్‌ఏ కోరం కనకయ్య వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీబీజీకేఎస్ ప్రచారానికి అన్ని వర్గాల నుంచి వెల్లువలా మద్దతు లభిస్తోంది. అడక్కుండానే వరాలిచ్చే దేవుడిగా సీఎం కేసీఆర్ ను కార్మికులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నారు.