సింగరేణిలో ముగిసిన పోలింగ్

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్న కార్మికులు ఓటు వేసే అవకాశం కల్పించారు. కార్మికులు విధులకు హాజరై, మధ్యాహ్నం తర్వాత ఎక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి తరలివచ్చారు. మొత్తం 52,534 మంది కార్మికులు ఉండగా.. సాయంత్రం 4 గంటల వరకు 92.81 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో 92 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. హైదరాబాద్ లోని సింగరేణి కార్పొరేట్ ఆఫీసులో కూడా ఓటింగ్ జరిగింది. రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, అర్ధరాత్రికల్లా ఫలితాలు ప్రకటించనున్నారు.