సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్

సమాజ్ వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు అఖిలేష్ యాదవ్. ఆగ్రాలో జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సులో అఖిలేష్ ను జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ పదవిలో అఖిలేష్ ఐదేళ్ల పాటూ కొనసాగనున్నారు. ములాయం, అఖిలేష్ మధ్య గతేడాది నెలకొన్న మనస్పర్ధల కారణంగా పార్టీ రెండుగా విడిపోయింది. అయితే పంచాయతీ ఈసీ వద్దకు వెళ్లగా…పార్టీ అఖిలేష్ కే దక్కుతుందని తేల్చింది. దీంతో జాతీయాధ్యక్షుడిగా ములాయంను తప్పించి….అఖిలేష్ బాధ్యతలు స్వీకరించారు. ములాయం పార్టీ మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారని ప్రకటించారు. అయితే అఖిలేష్ ను జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకున్న జాతీయ సదస్సుకు ములాయం గైర్హాజరయ్యారు. ఈ నేపధ్యంలో త్వరలోనే ఆయన కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.