శ్రీశైలం రెండు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కైలాస నాథుని జటాఝూటం నుంచి గంగమ్మ దుంకుతున్న చందంగా ఎగిసిపడుతోంది! నింగి నుంచి వెండి వెన్నెల జారుతున్నట్టుగా అద్భుతమైన దృశ్యం యాత్రికులను కనువిందు చేస్తోంది. భారీ వర్షాలకు శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం పై నుంచి తీసిన దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి!

శ్రీశైలం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తేయడంతో యాత్రికుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ సందర్శకులు పరవశిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాం అందాలు చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. డ్యాం దగ్గర ఆగి.. కృష్ణమ్మ ఉధృతిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.