శర్వానంద్ తో రొమాన్స్ చేయనున్న నివేదా

శ‌ర్వానంద్ మహానుభావుడు’తో మరో హిట్ ను సొంతం చేసుకున్న త‌ర్వాత రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. ఒక సినిమాకి దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ అయితే, మరో సినిమాకి దర్శకుడు సుధీర్ వర్మ. ప్రకాశ్ సినిమా ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కువగా చిత్రీకరించవలసి ఉందట. అందువలన సుధీర్ వర్మ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ డిఫరెంట్ షేడ్స్ తో .. డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ‘శతమానం భవతి’లో శర్వానంద్ తో అనుపమ జోడీ అదిరిందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. దాంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారటగానీ .. డేట్స్ సర్దుబాటు కావడం లేదట. ఈ నేపథ్యంలో నివేదా థామస్ ను తీసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.