వెల్‌నెస్ సెంట‌ర్‌ వెల్!

సీఎం కేసీఆర్ చిన్న‌నాటి గురువు, దుబ్బాక‌కు చెందిన బాల్‌ రెడ్డి త‌న మ‌న‌వ‌రాలు సాయంతో హైద‌రాబాద్‌ లోని వెల్ నెస్ సెంట‌ర్‌ని ఇవాళ సంద‌ర్శించారు. పెన్ష‌న‌ర్ అయిన బాల్‌రెడ్డి ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం వెల్‌నెస్ సెంట‌ర్‌కి వ‌చ్చారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య‌ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి.ల‌క్ష్మారెడ్డి వెంట‌నే ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, జ‌ర్న‌లిస్టుల ఆరోగ్య శ్రీ సీఈవో డాక్ట‌ర్ ప‌ద్మ‌, త‌న పీఆర్వోని అక్క‌డ‌కు పంపించి, వైద్య సేవ‌లు, ప‌రీక్ష‌లు స‌జావుగా అందేలా చూశారు. స్వ‌యంగా వారు ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించి, మందులు అందించారు.

వెల్ నెస్ సెంట‌ర్‌లో అందుతున్న వైద్య సేవ‌లపై బాల్ రెడ్డి సంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌న కోసం చొర‌వ తీసుకున్న వైద్య ఆరోగ్య‌ శాఖ మంత్రిని అభినందించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంచి వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని, వైద్య ఆరోగ్య‌ శాఖ ఎంతో మెరుగు ప‌డింద‌ని ప్రశంసించారు. త‌న వ‌ద్ద చ‌దువుకున్న సీఎం కేసీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. త్వ‌ర‌లో తాను రాయ‌బోయే వ్యాసంలో సీఎం కేసీఆర్‌, వైద్య ఆరోగ్య‌ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి. ల‌క్ష్మారెడ్డిలు వైద్య ఆరోగ్య రంగంలో చేస్తున్న కృషి  వివ‌రాలు పొందుప‌రుస్తాన‌ని పేర్కొన్నారు.