వనపర్తి ఎకో పార్క్ ప్రారంభం

వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో రూ.83 లక్షల ఖర్చుతో నిర్మించిన ఎకో పార్కుతో పాటు వనపర్తి మున్సిపల్‌ పార్కులో నిర్మించిన స్మృతి వనాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నింరజన్‌ రెడ్డి ప్రారంభించారు. వనపర్తి జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఎకో పార్కును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.