లాస్ వెగాస్ లో కాల్పులు: 50 మంది బలి

అమెరికాలో లాస్ వెగాస్ లో ఓ దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్ లోకి చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో 50 మందికి పైగా మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు అధికారులు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో కాల్పులు వినిపించడంతో…. ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. కాల్పులకు పాల్పడ్డ మరో దుండగుడు ఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, విస్తృత తనిఖీలు చేపట్టారు. తుపాకీలతో ఇద్దరు దుండగులు హోటల్‌లోని 32వ అంతస్తులోకి వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.