లండన్ లో విజయ్ మాల్యా అరెస్ట్

బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్  మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మనీల్యాండరింగ్‌  కేసులో ఆయనను లండన్  పోలీసులు అరెస్టు చేశారు. మాల్యా భారత్‌లో చేసిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి లావాదేవీలకు సంబంధించిన వివరాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమర్పించిన అఫిడవిట్‌ పై స్పందించిన లండన్‌ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలతో స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు మాల్యాను అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మాల్యాను గత ఏప్రిల్‌లోనూ పోలీసులు అరెస్ట్‌ చేసినా గంటల వ్యవధిలోనే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల నుంచి 9వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న మాల్యా వాటిని తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల కన్సార్టియం డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ని ఆశ్రయించింది. రుణ చెల్లింపుల విషయంలో బ్యాంకులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో గతేడాది మార్చి 9న విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోయారు