లండన్ లో చేనేత బతుకమ్మ సంబురాలు

చేనేతకు చేయూతనిస్తూ.. లండన్ లో చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలకు స్థానిక బ్రిటిష్ ఎంపీ సీమ మల్హోత్రా, భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్, లాంబెత్ మాజీ మేయర్ సాలేహ జాఫర్ హాజరయ్యారు. యూకే నలమూలల నుంచి 6 వందలకు పైగా కుటుంబాలు వేడుకల్లో పాల్గొన్నాయి. ఆడపడుచులు గౌరీ పూజ నిర్వహించి, బతుకమ్మల చుట్టు తిరుగుతూ ఆడిపాడారు. బతుకమ్మలని నిమజ్జనం చేసి, సద్దుల ప్రసాదం పంచుకున్నారు. అటు మగవారు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. సిరిసిల్ల చేనేత శాలువాలను ధరించి, జమ్మాకును పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంత్రి కేటీఆర్ కృషికి తమవంతు బాధ్యతగా.. ఇకపై వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని అంతా ప్రతిజ్ఞ చేశారు.