రోహింగ్యాల పట్ల సున్నితంగా వ్యవహరించాలి

దేశంలోని రోహింగ్యా ముస్లింల దుస్థితిపై కేంద్రం సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. దేశంలోని శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో మానవ హక్కులు, జాతీయ భద్రత మధ్య సమతూకం పాటించాల్సిన అవసరముందని తెలిపింది. అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేదని తెలిపింది. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు దేశంలోని రోహింగ్యాలను పంపించవద్దని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా  తమకు తెలియజేయాలని, ఈ విషయంలో అభ్యంతరం ఉంటే పిటిషనర్‌ తమను ఆశ్రయించవచ్చునని తెలిపింది.

దేశంలోని రోహింగ్యాలు శరణార్థులు కాదని, వారు అక్రమ వలసదారులని కేంద్రం ఇప్పటికే సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌ లో పేర్కొంది.