రేపటి నుంచి ఫిఫా అండర్ -17 వరల్డ్ కప్

ఇండియా వేదికగా సాకర్ సందడి చేయనుంది మొదటిసారిగా ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ కు భారత్ వేదికగా నిలిచింది. రేపటి నుంచి మొదలయ్యే టోర్నీలో 24 దేశాలకు చెందిన జట్లు పోటీ పడుతున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ లో తొలిసారిగా భారత యువజట్టు సమరానికి సై అంటోంది. ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ కు ఫస్ట్ టైమ్ ఆతిథ్యమిస్తోంది భారత్. రేపటి నుంచి 23 రోజుల పాటు జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం ఆరు వేదికల్లో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించనున్నారు. ఢిల్లీ, గౌహతి, నవీ ముంబై, కోల్ కతా, కొచ్చిన్, గోవాల్లో సాకర్ మ్యాచ్ లు జరగనున్నాయి. లీగ్ కప్ నాకౌట్ ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో 52 మ్యాచ్ లు జరుగుతాయి. వరల్డ్ కప్ ఆడే జట్లను ఆరు గ్రూపులు గా విభజించారు.