రెమ్యునేషన్ తగ్గించిన లావణ్య త్రిపాఠి

రెమ్యునేషన్ విషయంలో లావణ్యత్రిపాఠి భారీగా తగ్గించిందట. వివి వినాయక్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో లావణ్య సెలెక్ట్ చేశారు.. అయితే ఈ సినిమా కోసం లావణ్య 50 లక్షల రెమ్యునరేషన్ ని మాత్రమే తీసుకుందట. అలాగే రామ్ ఉన్నది ఒకటే జిందగీ సినిమాకి కూడా అంతే డిమాండ్ చేసిందట. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత కాస్త పెంచినా ఆ తర్వాత అపజయాలు పలకరించడంతో కాస్త వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. ఈమె కంటే తక్కువ హిట్స్ అందుకున్న హీరోయిన్స్ కూడా దాదాపు ఇంతే తీసుకుంటున్నారు. అయితే లావణ్య ప్రస్తుతం రెమ్యునరేషన్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదట కేవలం ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తుందని స‌మాచారం.