రెండో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం

భారత్-ఆస్ట్రేలియా మధ్య గౌహతిలో జరిగిన టీ 20 రెండో మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 122 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు టీ-20 మ్యాచ్ ల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమం అయ్యాయి. ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్‌లలో ఎంసీ హెన్రిక్స్ అత్యధికంగా 62 పరుగులు(46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), టీఎం హెడ్ 48 పరుగులు (34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌ గా నిలవగా.. ఏజే పించ్ 8 పరుగులు, డీఏ వార్నర్ 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా చెరో వికెట్ తీశారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ వేదికగా చివరి టీ-20 మ్యాచ్ జరగనుంది.

రెండో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌ మెన్లలో రోహిత్ శర్మ-8(నాలుగు బంతుల్లో 2 ఫోర్లు), శిఖర్ ధావన్(ఆరు బంతుల్లో 2 పరుగులు), మనీశ్‌ పాండే(ఏడు బంతుల్లో 6 పరుగులు), కేఎం జాదవ్(27 బంతుల్లో 27 పరుగులు), ఎంఎస్ ధోని(16 బంతుల్లో 13 పరుగులు), హెచ్‌.హెచ్. పాండ్యా(23 బంతుల్లో 25 పరుగులు), భువనేశ్వర్ కుమార్(ఆరు బంతుల్లో 1 పరుగు), జేజే బుమ్రా(తొమ్మిది బంతుల్లో 7 పరుగులు), కుల్‌దీప్ యాదవ్(19 బంతుల్లో 16 పరుగులు), వైఎస్ చాహాల్-3 పరుగులతో నాటౌట్‌ గా నిలవగా.. ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండానే క్యాచ్ ఔటయ్యాడు.118 పరుగులకే ఆలౌట్ అయ్యారు.