రాష్ట్రానికి మరో మూడు రోజులు భారీ వర్షసూచన

రాష్ట్రానికి మరో మూడు రోజులు భారీ వర్షసూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.  అటు రుతుపవనాలు రాష్ట్రంపై చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ బెంగాల్ గంగా తీర ప్రాంతం సరిహద్దు ప్రాంతాలపై సముద్రమట్టానికి  1.5 కిలో మీటర్ల ఎత్తున అల్పపీడన ఆవర్తనం విస్తరించింది.