రాష్ట్రంలో గొర్రెల పంపిణీ విజయవంతం

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ విజయవంతంగా సాగుతోందన్నారు.. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. జూన్ నుంచి ఇప్పటివరకు 23 లక్షల 80 వేల 518 గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటు గొర్రెలకు సంబంధించి ఎలాంటి సమస్య పరిష్కారానికైనా 1800 599 3699 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని తలసాని సూచించారు.