రాశీఖన్నాను ఫాలో అవుతున్న అనుష్క

అందాల టాప్  హీరోయిన్ అనుష్క ఇప్పుడు పూర్తిగా త‌న బొద్దును తగ్గించుకునే ప‌నిలో ప‌డింది. అమె చేతిలో ఉన్న ఒకే ఒక్క మూవీ భాగ‌మ‌తిని పూర్తి చేసేసింది.. ఒక త‌న బొద్దు త‌గ్గిన త‌ర్వాతే మ‌ళ్లీ కొత్త మూవీల‌కు సైన్ చేయాల‌ని భావిస్తున్న‌ది.. దీని కోసం కేర‌ళ వెళ్ల‌నుంది.. అక్క‌డ నేచ‌ర్ క్యూర్ తో ఫిజియో థెర‌పీని చేయించుకోనుంది. మూడు నెల‌ల పాటు అక్క‌డే ఉండే విధంగా ప్లాన్ వేసుకుంది.. సైజ్ జిరోకి ముందు అనుష్క స్లిమ్ గాను ఉండేది.. ఈ మూవీకోసం వీప‌రీత‌మైన బ‌రువు పెరిగింది.. తగ్గించుక‌నే క్ర‌మంలో ఉండ‌గా ఆమె సింగం షూటింగ్ మంచు ప‌ర్వ‌త ప్రాంతాలో జ‌రుగుతుండ‌గా గాయ‌ప‌డింది.. ఆ స‌మ‌యంలో దాని నివార‌ణ కోసం వాడిన మందుల‌తో మ‌రింత బ‌రువు పెరిగింది.. యోగ‌తో తగ్గించుకోవాల‌ని యోగా చేసినా ప్ర‌యోజనం లేక‌పోయింది.. దీంతో కేర‌ళ‌కు వెళ్లి ఫిజియో థెర‌ఫీ చేయించుకోవాల‌ని నిర్ణ‌యించింది. అందుకు ఒక కార‌ణం ఉంది.. టాలీవుడ్ లో బొద్దుగా ఉండే రాశీ ఖ‌న్నా స్లిమ్ కోసం ఏకంగా మూడు నెల‌ల కేర‌ళ‌లో క్యాంప్ వేసింది.. అక్క‌డే నేచుర్ క్యూర్ ప‌ద్ద‌తిలో ఫిజియో థెర‌ఫీ చేయించుకుంది.. దీంతో దాదాపు 20 కిలోలు తగ్గ‌డ‌మే కాకుండా స్లిమ్ గా మారిపోయింది. ఇక ఇప్ప‌టి యంగ్ హీరోయిన్స్ ర‌కుల్,రెజీనా, అంజ‌లిలో సైతం కేర‌ళ‌లోనే నేచుర్ క్యూర్ చేయించుకున్నారు. వారంతా ప్ర‌తి నెల‌లో ఒక నాలుగు రోజుల పాటు అక్క‌డేకే వెళుతున్నార‌ట‌.. దీంతో అనుష్క సైతం వారి బాట‌లోనే న‌డ‌వ‌నుంది.