రాజస్ధాన్ లో అత్యాచారం

రాజస్థాన్  లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినికి మద్యం తాగించి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.  సికార్   కు చెందిన దుండగుడు.. అమ్మాయిని బెదిరించి ఆమేతో బలవంతంగా మద్యం తాగించాడు. స్పృహ కోల్పోయేలా చేసి.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన  పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.