రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్ లోని జలావర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుల్లుగా మద్యం తాగి ట్రాక్టర్ నడిపిన ఓ వ్యక్తి…ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపాడు. రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో….ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మరణించడంతో జలావర్ లో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు….నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.