రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కు సీఎం కేసీఆర్ భూమిపూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. బైపాస్ రోడ్ లో జిల్లా పోలీస్ కార్యాలయం, అపెరల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత కొత్త కలెక్టరేట్ నమూనాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, బొడిగె శోభ, సీఎస్ ఎస్పీ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు.  స్వామివారి జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు.