రజనీ సరసన హ్యూమ ఖురేషీ

ద‌ర్శ‌కుడు  రంజిత్  తీస్తున్న చిత్రం  కాలా. పా. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్  రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు  . ఇందులో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ ఈ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. తొలి చిత్రంతోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా హ్యుమా ఖురేషీ తెలిపింది. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. చిత్రం బాగా రావాలని టీం మొత్తం కష్టపడి పనిచేస్తోంది. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. కథ విన్నప్పుడే నటించాలని నిర్ణయించుకున్నా, నటిస్తున్నా. రజనీతో కలిసి పనిచేయడం ఓ కల. అది ఈ సినిమాతో నిజమైంది. జీవితంలో ఇలాంటి అవకాశాలు కొన్ని సార్లే వస్తాయని చెప్పింది.