యూపీలో పట్టాలు తెలిపిన గూడ్స్ ర్యాలీ

యూపీలో మరో రైలు ప్రమాదం జరిగింది. మథుర ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.  అచ్నేరా-మథుర మార్గంలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే  గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా కాస్‌ గంజ్-అచ్నేరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.