విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల మృతి

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతిచెందగా…మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విద్యుత్ తీగలను గమనించక ఓ వ్యక్తి లారీపైకి ఎక్కగా..విద్యుత్ వైర్స్ అతనికి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అటు లారీని శుభ్రం చేస్తున్న మరో వ్యక్తి కూడ షాక్ తగిలి మృతిచెందాడు. లారీ క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.