మోడీ గుజరాత్ నమూనా విఫలం

ప్రధాని మోడీ గుజరాత్ నమూనా విఫలమైందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. గుజరాత్ లో అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని, మోడీ చెప్పే అబద్దాలు విని ప్రజలు విసిగిపోయారన్నారు. గుజరాత్  అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో… రాహుల్ ప్రచారం ముమ్మరం చేశారు. ‌ఖేడాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. తాము గుజరాత్ లో అధికారంలోకి వస్తే ప్రజల మన్ కీ బాత్ వింటాము తప్ప… నరేంద్ర మోడీ లాగా వ్యవహరించబోమన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పది మంది పారిశ్రామిక వేత్తలకు మేలు చేసేందుకే ప్రధాని డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నారని రాహుల్  విమర్శించారు.