మైనర్ వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

బాల్య వివాహాలపై సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. 18 ఏళ్లలోపు బాలికలతో లైంగిక సంబంధం అత్యాచారంగా పరిగణించాలని తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అంతేకాదు మైనర్ బాలికలు…తమపై జరిగిన లైంగిక దాడిపై సంవత్సరంలోపు ఎప్పుడైనా ఫిర్యాదు చేయోచ్చని తెలిపింది. 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సున్న భార్యతో లైంగిక సంబంధాన్నికూడా రేప్ గా పరిగణించాలని కోర్టు పేర్కొంది.