మెట్టుగూడ-బేగంపేట మధ్య ట్రయల్ రన్

హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సికింద్రాబాద్‌ మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు తొలి కూత పెట్టింది. వచ్చే నెల (నవంబరు) 28న ప్రధాని మోడీ చేతుల మీదుగా మియాపూర్‌ నుంచి అమీర్‌పేట, సికింద్రాబాద్ మీదుగా నాగోల్‌ వరకు 30 కిలోమీటర్ల మార్గం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెట్టుగూడ నుంచి బేగంపేట మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు. సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వద్ద నిర్మించిన స్టీల్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీదుగా పరేడ్‌ గ్రౌండ్స్‌, ప్యారడైజ్‌, రసూల్‌పురా, బేగంపేట ప్రకాశ్‌ నగర్‌ స్టేషన్‌ వరకు మెట్రోరైలు పరుగులు తీసింది.

నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఏడాది కిందటే మార్గం సిద్ధమై ట్రయల్ రన్ పూర్తయింది. ఇటీవల మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.