మూడేళ్లలో ఆర్థికాభివృద్ధిపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన మోడీ  

కేంద్రంలో బీజేపీ సర్కార్ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలపై వస్తున్న విమర్శలపై కౌంటర్‌ ఆటాక్ కు దిగారు ప్రధాని నరేంద్రమోడీ. తాము తీసుకున్న నోట్లరద్దు, జి.ఎస్‌.టి సరైన నిర్ణయాలేనని ప్రధాని సమర్థించుకున్నారు. గ్రోత్ రేటు తగ్గటంపై కొంతమంది నిరాశవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని పైరయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ లో కంపెనీ సెక్రటరీలతో సమావేశం సందర్భంగా ఆర్థిక విధానాలపై ప్రధాని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గ్రోత్ రేటు తగ్గటం ఇదే తొలిసారి కాదని…గత ప్రభుత్వంలోనూ ఇది జరిగిందన్నారు. కొంతకాలంగా విపక్షాలు సహా బీజేపీకి చెందిన యశ్వంత్‌ సిన్హా, అరుణ్ శౌరిలు విమర్శలు గుప్పించటంతో ప్రధాని మోడీ స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా…విపక్షాలు రాజకీయాలు చేయవద్దని సూచించారు.