ముగిసిన శశికళ పెరోల్ గడువు

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ పెరోల్ గడువు ముగిసింది. దాంతో ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో లొంగిపోనున్నారు. శశికళ మళ్లీ జైలుకు వెళ్తుండటంతో….ఆమెను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు నివాసానికి వచ్చారు. చెన్నైలోని తన నివాసం నుంచి మెరీనా బీచ్‌లోని జయ మెమోరియల్ వద్దకు వెళ్లనున్నారు శశికళ. అక్కడ జయకు నివాళులు అర్పించి బెంగళూరు బయల్దేరనున్నారు. శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఐదు రోజుల పెరోల్ మంజూరైంది.