మంథన్ గోడ్ లో ఘనంగా పీర్ల పండుగ

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం మంథన్‌ గోడ్‌ లో పీర్ల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతీఏడాది మొహరం సమయంలో ముస్లిములు సంతాప దినాలుగా పాటిస్తారు. ఊదు పొగల వాసనలతో.. డప్పు దరువులతో చిందులేస్తూ పీర్లను ఊరేగించారు. మొహరంలో పెద్దసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.