భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్   ప్రైజ్  దక్కింది. భౌతికశాస్త్రవేత్తలైన  రెయినర్  వీస్, బారీ సీ బారిష్‌  తో పాటు కిప్ థార్న్ లను ఈ అవార్డు వరించింది. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినందుకు ఈ శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారంతో సన్మానించనున్నారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు లేజర్ ఇంటర్‌  ఫెరోమీటర్ గ్రావిటేషనల్  వేవ్  అబ్జర్వేటరీ పరిశోధనశాలలో పనిచేస్తున్నారు. స్వీడన్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డులను ప్రకటించింది.