భూపాలపల్లిలో అభివృద్ధి పనులకు స్పీకర్ శంకుస్ధాపన

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ మధుసూదనా చారి పాల్గొన్నారు. మంజుర్ నగర్ లో 30 కోట్ల 88 లక్షలతో నిర్మించనున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలో నూతన పోలీస్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పుట్ట మధు, కలెక్టర్ మురళి, పలువురు అధికారులు, నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.